వెనక్కి తగ్గిన ‘టిల్లు స్క్వేర్’.!

- October 27, 2023 , by Maagulf
వెనక్కి తగ్గిన ‘టిల్లు స్క్వేర్’.!

‘డీజె టిల్లు’ సినిమాతో పిచ్చ పిచ్చగా క్రేజ్ కొట్టేసిన హీరో సిద్దు జొన్నలగడ్డ. చిన్న సినిమాల్లో పెద్ద విజయం నమోదు చేసింది ఈ సినిమా. తనదైన ఆటిట్యూడ్‌తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుని సెన్సేషనల్ అయిపోయాడీ కుర్ర హీరో.
అదే క్రేజ్‌తో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నాడు. అదే ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాదికి విడుదల లేనట్లే అని తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రోమోలు యూత్‌ని యాజ్ యూజ్‌వల్ ఉర్రూతలూగిస్తోంది. అలాగే, మొదటి పార్ట్‌లో నటించిన నేహా శెట్టిని రెండో పార్ట్‌లో ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా చూపించబోతున్నారట.
ఒక్క భామతోనే ఉల్టా ఫల్టా అయ్యాడు మొదటి పార్ట్‌లో.. ఇక ఇప్పుడు రెండో పార్ట్‌లో ఇద్దరు అందగత్తెలు. ఈ ఇద్దరు అందగత్తెల మధ్య రెండో టిల్లుగాడు ఎలా నలిగి నలిగి బయట పడతాడో.? తెలియాలంటే ఫిబ్రవరి వరకూ ఆగాల్సిందే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com