గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకులు

- October 31, 2023 , by Maagulf
గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకులు

దోహా: ఇజ్రాయెల్ దళాలు సోమవారం ఉత్తర,  మధ్య గాజాలోకి ప్రవేశించాయి. సెంట్రల్ గాజాలో ఒక ఇజ్రాయెల్ ట్యాంక్ ప్రధాన ఉత్తర-దక్షిణ రహదారిని నిర్బంధించింది. మరోవైపు గాజాపై భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెప్పింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. వాటిల్లో ట్యాంక్ నుంచి సైనికులు కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా వేలాది మంది క్షతగాత్రులతో పాటు పదివేల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న ఆసుపత్రులకు దగ్గరగా వైమానిక దాడులు జరుగుతున్నాయని UN హెచ్చరించింది. కొన్ని వీడియోలలో ఓ జర్నలిస్ట్ భయంతో పారిపోతూ, "గో బ్యాక్! గో బ్యాక్!" అనడం కనిపించింది. ఉత్తర గాజా పరిసర ప్రాంతాలకు ఇరువైపులా ఇజ్రాయెల్ తమ బలగాలను మోహరించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారి పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు,పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్-పాలస్తీనా హింసాకాండతో గాజాలో 1.4 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com