సంక్రాంతి బరిలో ‘సైంధవ్’.!

- October 31, 2023 , by Maagulf
సంక్రాంతి బరిలో ‘సైంధవ్’.!

సైలెంట్‌గా సంక్రాంతి బరిలో జాయిన్ అయిపోయాడు ‘సైంధవ్’‌గా విక్టరీ వెంకటేష్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘సైంధవ్’ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ‘హిట్’ సిరీస్ మూవీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు శైలేష్ కొలను. విక్టరీ వెంకటేష్‌తో ‘సైంధవ్’ అనే భీభత్సమైన యాక్షన్ డ్రామాతో ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి చిన్న యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. తనదైన పర్‌ఫామెన్స్‌తో, సీనియారిటీతో తన పాత్రకు హుందాతనంతో కూడిన పెద్దరికాన్ని ఆపాదించాడు విక్టరీ వెంకటేష్.

సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది చాలానే సినిమాలు బరిలో వున్నాయ్. తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి తన సినిమాని దించుతుండడంతో వెంకీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

జనవరి 13న ‘సైంధవ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నట్లు ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లే శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ, ఆండ్రియా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com