బిగ్‌బాస్ మహారాణులు.! ‘రాణీగిరి’ అంటే ఏంటో కాస్త నేర్పించండ్రా.!

- October 31, 2023 , by Maagulf
బిగ్‌బాస్ మహారాణులు.! ‘రాణీగిరి’ అంటే ఏంటో కాస్త నేర్పించండ్రా.!

బిగ్‌బాస్ హౌస్‌లోని అమ్మాయిల్ని మహారాణుల్లా చూసుకోవాలంటూ తాజాగా బిగ్‌బాస్, హౌస్‌లోని మేల్ కంటెస్టెంట్లకు టాస్క్ విధించాడు. ఓకే.! నిజంగానే ఇది ఓ ఫన్నీ టాస్క్.

ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడమే ఈ టాస్క్ యొక్క ముఖ్య వుద్దేశ్యం. అయితే, మరీ ‘రాణీగిరీ’ అంటే ఎంత పడితే అంత తినడమేనా.? అదీ మగవాళ్లతో తినిపించుకోవడమా.?

ఆ పేరు చెప్పి రతిక ఏడెనిమిది అరటి పండ్లు ఫటా ఫట్ లాగించేసింది ఒక్కటేసారి. శోభా శెట్టి అయితే, తేజతో ఏకంగా బ్రష్ చేయించుకుని ఫ్రూట్ జ్యూస్‌లు గట్రా చేయించుకుని తినేసింది. ఇక, ప్రియాంక ఓవరాక్షన్ అయితే చెప్పనేలేం. మిగిలిన ఫిమేల్ కంటెస్టెంట్ అశ్వని జస్ట్ ఓకే. భోలేతో పులిహోర కలిపే ప్రయత్నంలో బిజీగా వుండిపోయింది.

మహారాణుల్లా చూసుకోవడం అనే ప్యాటర్న్ టాస్క్ గత సీజన్లలోనూ వుంది. అయితే,  ఈ సీజన్‌లో ఈ టాస్క్ పిచ్చ బోరింగ్‌గా వుందంటూ బిగ్‌బాస్ వీక్షకులు వెక్కిరిస్తున్నారు.

అసలే వున్నదే నలుగురు అమ్మాయిలు హౌస్‌లో. అదే బోరింగ్ అంటే.. ఇక రాణి టాస్క్‌లో వీళ్లు చేస్తున్న ఓవరాక్షన్‌కి అబ్బో.! అబ్బబ్బో.! మీకేం తెలుస్తాయ్‌లెండి బిగ్‌బాస్ వీక్షకుల కష్టాలు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com