ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు
- November 01, 2023
విజయవాడ: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుండి విడుదలైన చంద్రబాబు..ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజమండ్రి నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేసిన బాబు..ఈరోజు ఉదయం 6 గంటకు నివాసానికి చేరుకున్నారు.
నిర్విరామంగా సుదీర్ఘ ప్రయాణంతో ఆయన అలసిపోయారు. దారి పొడవునా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం వేల సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు పెద్దఎత్తున ఇంటివద్దకు చేరుకుని గుమ్మడికాయలతో దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పలికారు. విజయవాడ పశ్చిమ జనసేన ఇంచార్జ్ పోతిన మహేష్ నేతృత్వంలో పెద్దఎత్తున జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురేగి స్వాగతించారు. సంఘీభావంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







