వెనుదిరిగిన జపాన్ బృందం..
- May 24, 2016
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జపాన్ బృందం షాక్ ఇచ్చింది. తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో అయిదు నిమిషాలు కూడా సందర్శించకుండా ఆ బృందం వెళ్లిపోయింది. బస్సులో నుంచే నిర్మాణాలను చూసిన ఆ బృందం వెనుదిరిగింది. కాగా జపాన్ బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శిస్తుందంటూ ఎల్లో మీడియా మంగళవారం ఉదయం నుంచే హడావుడి చేసింది. అయితే బృంద సభ్యులు మాత్రం వెలగపూడిలో కనీసం బస్సు దిగి కూడా చూడలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేవరకూ కూడా జపాన్ బృందం అక్కడ వేచి చూడకుండానే వెళ్లిపోయింది. అనంతరం అక్కడకు వచ్చిన చంద్రబాబు... అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయ నిర్మాణ మ్యాప్ ను పరిశీలించిన ఆయన, ఎప్పటికప్పుడూ నిర్మాణ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వెనుదిరిగిన
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









