గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా అధికారిక లావాదేవీల లెక్కింపు
- November 02, 2023
రియాద్: గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా అన్ని అధికారిక విధానాలు, లావాదేవీలలో వ్యవధిని లెక్కించడానికి సౌదీ మంత్రుల మండలి మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, ఇస్లామిక్ షరియా నిబంధనలకు సంబంధించిన అన్నింటికీ మినహాయింపు ఉంటుందని, ఇక్కడ కాలాల గణన హిజ్రీ తేదీపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. రియాద్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వీక్లీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా గతంలో కొన్ని అధికారిక, చట్టపరమైన కార్యకలాపాలలో గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా వ్యవధిని పరిగణనలోకి తీసుకోవడాన్ని ప్రారంభించారు. రాజ్యం హిజ్రీ క్యాలెండర్‌ను మొదటి అధికారిక క్యాలెండర్‌గా ఉపయోగిస్తోంది. అదే సమయంలో గ్రెగోరియన్‌ను రెండవ క్యాలెండర్‌గా ఉపయోగిస్తోంది. హిర్జీ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే సంవత్సరంలో 11 లేదా 12 రోజులు తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







