కువైట్‌లో 30% పెరిగిన డొమెస్టిక్ వర్కర్స్..భారతీయుల సంఖ్య ఎంతంటే?
- November 02, 2023
కువైట్: గత ఏడాది కంటే కువైట్‌లో గృహ కార్మికుల సంఖ్య 30 శాతం పెరిగినట్లు లేబర్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధికార గణంకాల ప్రకారం.. కువైట్‌లో గృహ కార్మికుల సంఖ్య గత సంవత్సరం 583,000తో పోలిస్తే గత అక్టోబర్ నాటికి 811,000కి చేరుకుంది. వీరిలో 28.7 శాతం మాత్రమే స్త్రీలు, మిగిలిన వారు పురుషులు ఉన్నారు. ఫిలిపినో గృహ కార్మికులపై నిషేధం ఉన్నప్పటికీ, 2023లో వారి సంఖ్య దాదాపు 201,000కి చేరుకుంది. కువైట్ లో ఉన్న మహిళా గృహ కార్మికులలో ఎక్కువగా ఫిలిపినోలు ఉన్నారు. భారతదేశం నుండి వచ్చే గృహ కార్మికుల సంఖ్య గత సంవత్సరం కంటే సుమారు 30 శాతం పెరిగి దాదాపు 361,000కి చేరుకుంది. ఇందులో 28.7 శాతం మాత్రమే స్త్రీలు, మిగిలిన వారు పురుషులు ఉన్నారు. శ్రీలంక నుండి గృహ కార్మికులు 2022లో 79,000 నుండి 2023 నాటికి 48,200కి తగ్గడం గమనార్హం.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







