COP28: దుబాయ్‌లో 3 రోజులు గడపనున్న పోప్ ఫ్రాన్సిస్

- November 02, 2023 , by Maagulf
COP28: దుబాయ్‌లో 3 రోజులు గడపనున్న పోప్ ఫ్రాన్సిస్

యూఏఈ: వాతావరణ మార్పుల COP28 కాన్ఫరెన్స్ కోసం తాను డిసెంబర్ ప్రారంభంలో దుబాయ్‌కి వెళతానని పోప్ ఫ్రాన్సిస్ బుధవారం చెప్పారు. డిసెంబర్ 1న దుబాయ్ బయలుదేరి 3వ తేదీ వరకు అక్కడే ఉంటానని తెలిపారు.  పర్యావరణం పట్ల శ్రద్ధ వహించడానికి తన పోప్ పదవిలో ఉన్న సమయంలో తాను చాలా ఆందోళన చెందినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇటాలియన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ ప్రకటించారు.  దుబాయ్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 12 వరకు కొనసాగుతుంది. పోప్ 2015లో రాసిన ఓ ఆర్టికల్ లో.. భూమి వేడెక్కడం గురించి హెచ్చరించారు. భూమిపై క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా అనేక జీవజాతులు కనుమరుగైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దుబాయ్ ఎడిషన్ అనేది వాతావరణ మార్పుల ప్రభావం, గ్రీన్‌హౌస్-గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలు,  వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సి చర్యలపై COP సమావేశాల సందర్భంగా చర్చించనున్నారు.  COP మొదటి సమావేశం 1995లో బెర్లిన్‌లో జరిగింది. అప్పటి నుండి వివిధ నగరాల్లో,  వివిధ ఖండాల్లో ఈ సమావేశం జరుగుతూ వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com