'సలార్’ సందడికి తెర లేపేదెప్పుడు ప్రశాంత్ నీల్.?
- November 02, 2023
‘కేజీఎఫ్’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ తాజాగా ‘సలార్’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రబాస్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’ కావడంతో అంచనాలు భారీగా వున్నాయ్ ఈ సినిమా మీద.
వాయిదాల పర్వం తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు డిశంబర్‌లో రిలీజ్‌కి ముస్తాబవుతోంది. అయితే, ఇంతవరకూ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా రావల్సిన టీజర్లు కానీ, ట్రైలర్లు కానీ రాలేదింతవరకూ.
ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే, త్వరలోనే ఓ అదిరిపోయే టీజర్‌కి ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.
ఇదిలా వుంటే, ‘సలార్’ రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగిందింతవరకూ. కానీ, అంత సీను లేదనీ, రెండో పార్ట్‌ని కూడా మొదటి పార్ట్‌లోనే కలిపేసి ఒక్కటిగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దాంతో సినిమాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
సినిమా అవుట్ పుట్ ఎలా వచ్చింది.? ఐటెం సాంగ్స్ గట్రా వున్నాయా.? యాక్షన్ బ్లాక్స్ ఏ రేంజ్లో వుంటాయ్.? తదితర పలు రకాల ప్రశ్నలు ‘సలార్’పై. తాజాగా మరో 50 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది.. అంటూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ‘సలార్’ టీమ్.!
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







