దీపావళికి ‘జపాన్’ దద్దరిల్లిపోద్ది.!
- November 02, 2023
కార్తి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జపాన్ - మేడ్ ఇన్ ఇండియా’ దీపావళి రేస్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలు భారీగా వున్నాయ్. లేటెస్ట్గా రిలీజ్ అయిన ‘జపాన్’ ట్రైలర్‌తో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటేశాయ్.
గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇక, కార్తీ నటనే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఆధ్యంతం ఎంటర్టైన్మెంట్గా నడుస్తూ.. కార్తీ చేసే సాహసాలు.. ఈ సినిమాలో చూడబోతున్నాం.
అలాగే, డిఫరెంట్ మ్యానరిజమ్స్‌తో కార్తి పర్ఫామెన్స్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. సినిమా మేకింగ్ వేల్యూస్ కూడా చాలా చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయ్.
దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయినగా నటిస్తోంది. సునీల్ ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నాడు.
కార్తి మంచి నటుడు. సీరియస్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా సరే ఇట్టే సెట్ అయిపోతుంటాడు. తనదైన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంటాడు. ‘ఖైదీ’ తదతర సినిమాల్లో సీరియస్ లుక్స్‌లో కనిపించి మెప్పించిన కార్తి ఇప్పుడు ‘జపాన్’గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నాడు. దీపావళికి వేరే ఇతర పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో, కార్తికి అది కలసొస్తుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







