కూతురి కోసం నిర్మాతగా మారిన యాక్షన్ కింగ్ అర్జున్.
- May 24, 2016
ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న యాక్షన్ కింగ్ అర్జున్. నటుడిగానే కాదు దర్శకుడిగాను తనలోని టాలెంట్‌ను ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే తన కూతురిని కథానాయికగా ప్రోత్సహించేందుకు అర్జున్ నిర్మాతగాను మారనున్నట్టు తెలుస్తుంది. అర్జున్ కూతురు ఐశ్వర్య పట్టత్తుయానై అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయింది. విశాల్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం మంచి ఫలితాన్ని సాధించకపోవడంతో ఐశ్వర్యకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి 'కాదలిన్ పొన్ వీథియల్' అనే ప్రేమ కథాంశాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది. చందన్- ఐశ్వర్య జంటగా రానున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తమిళం, కన్నడ భాషలలో రానున్న ఈ చిత్రాన్ని అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రంలో తాను కనిపించే ప్రయత్నం చేయడంలేదని అర్జున్ తెలిపాడు. మరి అర్జున్ తన కూతురు కోసం నిర్మాతగా మారి చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







