ముచ్చటగా ముగిసిన మ్యూసిక్ ఇండియా ప్రోగ్రాములు
- May 24, 2016
2016 రంజాన్ నెల సెలవులకి ముందుగా మ్యూసిక్ ఇండియా వారు రెండు ప్రోగ్ర్యామ్స్ తో యుఏఈ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు!
13-మే శుక్రవారం నాడు "అన్నమయ్య ఆరాధన" పేరు తో అన్నమయ్య 607వ జయంతి, అమ్మవారు శ్రీ పద్మావతీ దేవి కి పుష్పయాగం తో, అన్నమయ్య సంకీర్తనల స్వరార్చన తో సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి.
శ్రీమతి సంగీత రాజేష్ వైయొలిన్ పై, శ్రీ రామచంద్రన్ మృదంగం పై, శ్రీ శివ రామ కృష్ణ తబలా, రితమ్స్ పై మరియు శ్రీ సోమ్‌నాథ్ గారు ఘటం పై స్వరార్చనకి గొప్ప వాద్య సహకారం అందించారు.
స్వరార్చన లో పద్మావతి అమ్మవారి కి గాను అన్నమయ్య రాసిన అధ్భుతమైన సంకీర్తనలు ఆలకించిన వారు -
1. అబూ ధాబీ గ్రూప్ శ్రీమతి రాధిక దుగ్గిరాల, శ్రీమతి ఉషాబాల కౌతా, కుమారి. శ్రావణి కౌతా
2. శ్రీమతి. లక్ష్మి కామేశ్వరి విద్యార్ధులు శ్రావణి, లావణ్య, అనన్య, దీప్ప్శిఖ, కమల శ్రేయ
3. శ్రీ కరం గ్రూప్ మహిళలు - డాక్టర్ కొమర్రాజు సురేషి, శ్రీమతి. అర్చన చల్లురి, శ్రీమతి. పద్మజ రెడ్డి, శ్రీమతి శ్రీలత, శ్రీమతి. మంగు పావని, శ్రీమతి. ప్రసన్న లక్ష్మి, శ్రీమతి. లావణ్య తిప్పరాజు, శ్రీమతి. ప్రశాంతి రావు, శ్రీమతి ఉమా, శ్రీమతి శ్రీదేవి.
మ్యూసిక్ ఇండియా సింగర్స్ శ్రీ రాకేశ్, శ్రీ వెంకటేష్ మరియు శ్రీమతి ప్రశాంతి చోప్రా గాత్రం మరియు శ్రీమతి విజయ లక్ష్మి గారి వీణా వాదన శ్రోతలను ప్రత్యెకంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమం దుబాయ్ లొని ఫార్ట్యున్ గ్రాండ్ హోటల్ అప్పార్ట్ మెంట్స్ పార్టీ హాల్ లొ, పంతులు సతీష్ గారి ఆధ్వర్యంలొ ఎంతొ భక్తి స్రధ్ధలతో సవ్యంగా ముగిసింది.
20-మే శుక్రవారం సాయంత్రం అబూ దాభి ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ లో మ్యూజిక్ ఇండియా “మేరీ ఆవాజ్ సునో” మూడవ ఎపిసోడ్ ”నైటింగేల్ ఆఫ్ సౌత్" శ్రీ మతి ఎస్ జానకి సూపెర్ హిట్ సాంగ్స్ తో ఎంతో అద్భుతంగా ముగిసింది. ఆన్లైన్ ఆడిషన్ ద్వారా ఎంపిక చేసిన 5 కొత్త సింగర్స్ కుమారి. అస్వాతి, శ్రీమతి. జయలక్ష్మి, శ్రీమతి. హిమ బిందు వారణాసి, శ్రీమతి. శిఖా మరియు శ్రీ సుదీర్ ల కి అవకాశం ఇస్తూ మ్యూసిక్ ఇండియా టీమ్ సింగర్స్ శ్రీమతి. విజయ్ లక్ష్మి, శ్రీమతి. ఇందిరా, శ్రీ. రాకేశ్, శ్రీ. రవీంద్ర, శ్రీ.వెంకట్ మరియు మ్యూజిక్ ఇండియా ఫౌండర్ శ్రీమతి. ప్రశాంతి చోప్రా. తమ గాత్రం తొ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నారు.
జానకమ్మ తెలుగు, తమిళ్, హింది, కన్నడ మరియు మళయాళం సూపర్ హిట్ పాటలను సిన్గర్స్ యెంతొ ఆహ్లాదంగా, మనసుకి హత్తుకునెలా పాడి అందరి మన్ననలను పొందారు.
రెండు ప్రొగ్రామ్సు లోను శ్రీమతి సౌమ్య చిత్తర్వు వ్యాఖ్యాత గా ఎంతొ సమయస్పూర్తి తొ వ్యవహరించి అందరితోను శభాష్ అనిపించుకున్నారు.
మ్యూసిక్ ఇన్డియా టీమ్ ఫౌండెర్ శ్రీమతి ప్రశాంతి చోప్రా మరియు ఫౌండెర్ మెమ్బర్ శ్రీ రాకెశ్ పార్టిసిపెంట్స్ అందరికి సెర్టిఫిసట్లు , మొమెన్టోలు ఇచ్చి కార్యక్రమాలని పరిపూర్నం చేసారు.
భారతీయ సంగీతం లొ రుచి ఉండి మ్యూజిక్ ఇండియా గ్రూప్ లో చెరాలనుకునే వారు ఫెస్ బుక్ లొ లో మా పేజ్ https://www.facebook.com/


తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







