భారీ భూకంపం..ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఉంటాం: ప్రధాని మోడీ
- November 04, 2023
న్యూఢిల్లీ: హిమాలయ దేశం నేపాల్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కనీసం 128 మంది ప్రజల ప్రాణాలను హరించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎంతో మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
ఎక్స్ వేదికగా మోడీ స్పందిస్తూ… నేపాల్ లో భూకంపం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. ఈ విషాదకర సమయంలో నేపాల్ కు అండగా ఇండియా ఉంటుందని… అన్ని రకాల సహాయ సహకారాలను నేపాల్ కు అందిస్తామని తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)ను ట్యాగ్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







