నవంబర్ 10 నుండి కువైట్‌లో చలిగాలులు

- November 05, 2023 , by Maagulf
నవంబర్ 10 నుండి కువైట్‌లో చలిగాలులు

కువైట్: కువైట్‌లో చలికాలం ప్రారంభం కానుంది. నవంబర్ 10వ తేదీ నుండి చలికాలం ప్రారంభం కానుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. కువైట్ లో నవంబర్ 10వ తేదీన "అల్అహిమర్ నక్షత్రం సూర్యాస్తమయం" అని పిలువబడే ఖగోళ సంఘటన చోటుచేసుకోనుందని, ఇది 40 రోజుల పాటు కొనసాగుతుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ వెల్లడించింది. ఇది దేశంలోకి చల్లని ఉత్తర గాలుల ప్రవేశాన్ని సూచిస్తుంది. ఈ గాలుల రాకతో శీతాకాలపు చలి ప్రారంభమవుతుంది. ఈ కాలంలో క్రమంగా  ఉష్ణోగ్రతలు తగ్గుతాయని సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com