బహ్రెయిన్ ఇక పై కఠినమైన శిక్షలు..!
- November 05, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో అధిక స్థాయి నేరాలు లేదా దుర్వినియోగంతో కూడిన నేరాలకు ఇక నుండి కఠినమైన శిక్షలు వేయనున్నారు. చట్టంలో నిర్దేశించిన దానికంటే ఎక్కువగా జైలుశిక్షలు పడతాయని ప్రాసిక్యూషన్ శనివారం ప్రకటించింది. క్రిమినల్ కేసుల్లో విచారణ జరిపి శిక్షలు ఖరారు చేసే న్యాయమూర్తులు ఇకపై విచక్షణాధికారాన్ని వినియోగించుకోవచ్చని పోలీస్ మీడియా సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. నేరం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మరింత తీవ్రత అవసరమయ్యే శిక్షలను న్యాయమూర్తులు వేయడానికి ఈ మార్పు ఉద్దేశించబడిందని ప్రాసిక్యూషన్ తెలిపింది. నేరస్థుడి నేరపూరిత ఉద్దేశాలు తీవ్రంగా ఉంటే, శిక్ష మరింత బలంగా ఉంటుందని, న్యాయమూర్తి ఇప్పుడు ఒక కేసులో అటువంటి ప్రత్యేక పరిస్థితులను పరిగణించవచ్చని ప్రాసిక్యూషన్ వివరించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం