అబుదాబి, దుబాయ్, ఇతర ఎమిరేట్స్‌కు రెయిన్ అలెర్ట్
- November 05, 2023
యూఏఈ: తీర ప్రాంతాలు, కొన్ని అంతర్గత ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ ను జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసింది. అథారిటీ షేర్ చేసిన మ్యాప్ ప్రకారం.. అబుదాబి, దుబాయ్, షార్జా మరియు ఇతర ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ వర్తిస్తుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల వరకు అమలులో ఉంటుంది. వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని వాహనదారులను హెచ్చరించించింది. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రతికూల వాతావరణంలో అతివేగాన్ని నివారించాలని షార్జా పోలీసులు కోరారు. వర్షం సమయంలో లోతట్టు ప్రాంతాలు, లోయలలోకి వెళ్లవద్దని సూచించింది. ముఖ్యంగా తూర్పు ప్రాంతాలు ఆకస్మిక వరదలకు గురయ్యే అవకాశం ఉందని, నివాసితులు ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని NCM హెచ్చరించింది. దీంతో అబుదాబిలో 26°C, దుబాయ్‌లో 27°C కి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. పర్వత ప్రాంతాలలో ఈరోజు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం