గాజాలో సైనిక తీవ్రతను ఆపండి: సౌదీ
- November 05, 2023
అమ్మాన్: గాజాలో సైనిక తీవ్రతను ఆపడానికి తన అరబ్, అమెరికన్ సహచరులతో జోర్డాన్‌లోని అమ్మన్లో జరిగిన సమావేశాలలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ పాల్గొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, అది కలిగించే మానవతా విపత్తును ఆపడానికి ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఉద్దేశించిన అరబ్ కోఆర్డినేషన్ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రులు.. గాజా పరిస్థితులపై చర్చించారు.అమాయక పౌరులను చంపుతున్న గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపడానికి అంతర్జాతీయ సమాజం అత్యవసర పాత్రను పోషించాలని ఈ సందర్భంగా కోరారు. పాలస్తీనియన్ల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయమైన,సమగ్రమైన పరిష్కారాన్ని కనుగొనాలని అరబ్ సమావేశం కోరింది.
అనంతరం సౌదీ విదేశాంగ మంత్రి అరబ్-యుఎస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమాయకుల హత్యకు దారితీసిన సైనిక తీవ్రతను ఆపడానికి, ఈ ప్రాంతానికి తక్షణమే మరియు అత్యవసరంగా మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. అరబ్-అమెరికన్ సమావేశంలో పాల్గొన్న నేతలు పాలస్తీనియన్లు వారి చట్టబద్ధమైన హక్కులను పొందేలా, న్యాయమైన శాశ్వత శాంతిని సాధించేలా శాంతి మార్గాన్ని పునరుద్ధరించడం గురించి చర్చించారు. రెండు సమావేశాలు ముగిసిన తర్వాత జోర్డాన్ రాజు అబ్దుల్లా II, అల్-హుస్సేనియా ప్యాలెస్‌లో ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, అరబ్ ప్రతినిధుల అధిపతులను, అమ్మన్ సమావేశంలో పాల్గొన్న వారికి రిసెప్షన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..