హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట
- November 06, 2023
అమెరికా: అమెరికాలో హెచ్-1బీ(H-1b) వీసాదారులకు శుభవార్త! హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల ఉద్యోగానుమతికి సంబంధించిన కింది కోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును సమీక్షించబోమని అమెరికా సుప్రీం కోర్టు తాజాగా నిర్ణయించింది. దీంతో, హెచ్-4(H-4) ఎంప్లాయ్‌మెంట్ ఆథొరైజేషన్ డాక్యుమెంట్‌కు (EAD- ఉద్యోగానుమతికి) సంబంధించి ప్రస్తుత నిబంధనలే కొనసాగనున్నాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, హెచ్-1బీ వీసాదారులకు వీసా కాలపరిమితి ఆరు సంవత్సరాలకు మించి పొడిగించినా లేదా వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లో వారీ జీవితభాగస్వాములు(హె-4 వీసాదారులు) ఉద్యోగానుమతికి పొందేందుకు అర్హులు. 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. గ్రీన్ కార్డుల జారీలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుండటంతో భారతీయులకు లాభించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కానీ, హెచ్-1బీ వీసా కారణంగా ప్రభావితమైన అమెరికా టెక్ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. ఉద్యోగానుమతి నిబంధన అమలు చేసే అధికారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీకి లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నిబంధన అమలుకు కాంగ్రెస్ అనుమతి కూడా కావాలన్నారు. అయితే, కోర్టు మాత్రం ఎన్నారైలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును పునఃసమీక్షించేందుకు తాజాగా సుప్రీంకోర్టు కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎన్నారైలకు భారీ ఊరట లభించినట్టైంది. ఎన్నారైల భాగస్వాముల ఉద్యోగ భద్రతకు ముప్పు తప్పినట్టైంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









