వెలుగులు విరజిమ్మిన దీపావళి ఉత్సవ్-2023..హాజరైన 10వేల మంది ప్రవాసులు

- November 07, 2023 , by Maagulf
వెలుగులు విరజిమ్మిన దీపావళి ఉత్సవ్-2023..హాజరైన 10వేల మంది ప్రవాసులు

దుబాయ్: దుబాయ్ లో జరిగిన సర్వో దీపావళి ఉత్సవ్-2023లో భారత సూపర్ స్టార్ జాన్ అబ్రహం, స్టీఫెన్ దేవస్సీలు అదరగొట్టారు.  'భిన్నత్వంలో ఏకత్వం' థీమ్ తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూఏఈ వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రవాస భారతీయులు హాజరై సందడి చేశారు. నవంబర్ 5న దుబాయ్‌లోని ఎటిసలాట్ అకాడమీ దీపావళీ వేడుకలతో వెలిగిపోయింది. ఇండియాకు చెందిన నంబర్ వన్ లూబ్రికెంట్ బ్రాండ్ అయిన సర్వో స్పాన్సర్ చేసింది.  కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా సతీష్ కుమార్ శివన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) సతీష్ కుమార్, వెంకటేష్, విశ్వజిత్, నంబియార్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్ కోసం రెండు ప్రీమియం సర్వో లూబ్రికెంట్లను స్టార్ బ్రాండ్ అంబాసిడర్ జాన్ అబ్రహం విడుదల చేసారు. గతేడాది కూడా దీపావళి ఉత్సవ్‌ను ఎటిసలాట్ అకాడమీలో ఘనంగా జరుపుకున్నారు. స్టీఫెన్ దేవస్సీ, శ్రీనిషా నిర్వహించిన లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రంగోలీ, సంప్రదాయ నృత్య పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com