జైల్లో నిరాహార దీక్షకు దిగిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మది

- November 07, 2023 , by Maagulf
జైల్లో నిరాహార దీక్షకు దిగిన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మది

టెహ్రాన్‌: నోబెల్‌ శాంతి బహుమతి-2023 గ్రహీత నర్గీస్‌ మొహమ్మది సోమవారం జైలులో నిరాహారదీక్షకు దిగారు. అనారోగ్యసమస్యలో బాధపడుతున్న ఆమెను హిజాబ్‌ ధరించి ఆస్పత్రికి వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో గతవారం గుండె, ఊపిరితిత్తుల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదని మానవ హక్కుల కమిటీ తెలిపింది.

'ఈ రోజు నర్గీస్‌ నిరాహార దీక్షకు దిగారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ విధానం, అనారోగ్యంతో ఉన్న ఖైదీల సంరక్షణను ఆలస్యం చేయడం, ఫలితంగా వారు తీవ్ర అనారోగ్యం పాలవ్వచ్చు లేదా ప్రాణాలను కోల్పోవచ్చు. రెండు ఇరాన్‌ మహిళలకు మరణం లేదా తప్పనిసరి హిజాబ్‌ విధానం'ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ ఆమె నిరాహారదీక్షకు దిగినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

నర్గీస్‌ గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, కానీ జైలు అధికారులు హిజాబ్‌ ధరించకుండా ఆస్పత్రికి అనుమతించేందుకు తిరస్కరించారని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కేవలం ఓఆర్‌ఎస్‌ (ఉప్పు, చక్కెర కలిపిన నీరు) మాత్రమే తీసుకుంటున్నారని, మెడిసిన్‌ తీసుకోవడం లేదని తెలిపారు.

నర్గిస్‌కు వైద్య సేవలను నిరాకరించడంపై నోబెల్‌ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఆస్పత్రిలో చేరాలంటే మహిళా ఖైదీలు తప్పనిసరిగా హిజాబ్‌ ధరించాలనే నిబంధన అమానవీయమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది అనైతికమని.. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను కోరింది.

ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆమెను ఇరాన్‌ అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆమె 13 సార్లు అరెస్టు అయ్యారు. ఐదుసార్లు జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com