మహిళల పవర్ చాటిన దుబాయ్ రన్

- November 07, 2023 , by Maagulf
మహిళల పవర్ చాటిన దుబాయ్ రన్

యూఏఈ: దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లో నవంబర్ 5న అతిపెద్ద మహిళా రన్ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఇది గర్ల్ పవర్, మహిళల సత్తాను చాటిచెప్పింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెట్టడం ద్వారా మహిళలను శక్తివంతం చేయడం ఈ రన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ముహమ్మద్ అల్-ముర్ తెలిపారు. యూఏఈ అథ్లెటిక్ ఫెడరేషన్ మరియు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సహకారంతో ప్లాన్ బి గ్రూప్ ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. దీనికి పర్యావరణ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలిచింది.

దుబాయ్ ఉమెన్స్ రన్ అనేది అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయడం, దుబాయ్ నగరం ఎంత బహుళసాంస్కృతికంగా ఉందో తెలియజేయడం, ఈ ప్రాంతంలోని బలమైన మహిళలకు తమ ఉనికిని తెలియజేసేందుకు ఇది వేదికగా నిలిచిందన్నారు. గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ రేసు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని ముహమ్మద్ అల్-ముర్ వెల్లడించారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్‌లో మహిళలది ఒక ముఖ్యమైన పాత్ర అని, ఇందులో విజేతలుగా నిలిచిన వారు యూఏఈ తరపున విదేశీ ఫోరమ్‌లలో పాల్గొంటారని అల్-ముర్ పేర్కొన్నారు.

ఇక ఈ రన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తెలుగు మహిళలు. చీరలలో ఈ రన్ కు హాజరయ్యి కాన్సర్ బాధితులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

దుబాయ్ లో నివసిస్తున్న విమల ఆధ్వర్యంలో "Pretty Telugu Women" అంటూ ఒక 35 మంది మహిళలు; మన చీర కట్టుకి సాటి మరేది లేదు అనే రీతిలో ఈ రన్ లో పాల్గొని సందడి చేశారు. నిర్వాహకులు వీరికి మెమెంటోలు అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చి ఈ రన్ లో పాల్గొనేందుకు వచ్చిన మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు "Pretty Telugu Women" టీమ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com