జనవరి నుంచి ‘యుద్ధ’ భూమిలో ఎన్టీయార్ విలనిజం.!
- November 08, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ గ్లోబల్ రేంజ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందబోతున్నట్లు అప్పట్లోనే అనౌన్స్ చేశారు.
అదే ‘వార్ 2’. ఎన్టీయార్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించే ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోందనీ తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసింది చిత్ర యూనిట్.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ వుంది. ఈ లోపు ఎన్టీయార్ ‘దేవర’ సినిమా పూర్తి చేసి, ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడనీ తెలుస్తోంది.
మరోవైపు ‘దేవర’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి పార్ట్ డిశంబర్కల్లా పూర్తి కానుందనీ తెలుస్తోంది. ఆ తర్వాత ‘వార్ 2’ సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నారట ఎన్టీయార్. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీయార్ మధ్య జరిగే యాక్షన్ ఘట్టాలే సినిమాకి హైలైట్. హాలీవుడ్ రేంజ్లో ఆ యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరించేందుకు అయాన్ ముఖర్జీ సర్వం సిద్ధం చేశారట.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









