OMR83 మిలియన్ల విలువైన 15 ఫుడ్ ప్రాజెక్ట్‌లు

- November 10, 2023 , by Maagulf
OMR83 మిలియన్ల విలువైన 15 ఫుడ్ ప్రాజెక్ట్‌లు

మస్కట్: రెండు వారాల పాటు నిర్వహించిన వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ 2023 టాస్క్‌లు మస్కట్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక ఉత్పత్తుల కీలక ప్రాజెక్టులతో  సహా ఆహార భద్రతకు సంబంధించిన వివిధ రంగాలలో స్థానిక, విదేశీ పెట్టుబడులను పెంపొందించే మార్గాలపై చర్చించారు. ల్యాబ్ దాదాపు RO 83 మిలియన్ల పెట్టుబడి విలువతో 15 ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. అలాగే RO38 మిలియన్ల మేరకు 26 ఉపయోగ ఒప్పందాలపై సంతకం చేయబడ్డాయి. ల్యాబ్‌లో భాగంగా 12 పెట్టుబడి ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం లభించగా.. దాదాపు RO 756 మిలియన్ల విలువైన ప్రాజెక్ట్‌ల కోసం మరో 174 పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించారు. ఈ ల్యాబ్ ముగింపు కార్యక్రమంలో హౌసింగ్,  అర్బన్ ప్లానింగ్ శాఖ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ సైద్ అల్ షుయైలీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com