తెలంగాణ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ
- November 14, 2023
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చిల్లకూరు సుమలతను కర్ణాటక, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కు మార్ ను మద్రాస్ హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 10న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘X’ ద్వారా వెల్లడించారు.
రాజ్యాంగం కల్పించిన అధికారాలను అనుసరించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి ఈ న్యాయమూర్తులను బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరితో పాటు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ను మద్రాస్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బి.షరాఫ్ ను అలహాబాద్, జస్టిస్ బిబేక్ చౌదరిని పాట్నా హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







