రక్త హీనతకు దానిమ్మ ఓ వరమే సుమా.!

- November 14, 2023 , by Maagulf
రక్త హీనతకు దానిమ్మ ఓ వరమే సుమా.!

దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ తెలిసిందే. ఈ పండు ఎక్కువగా తింటే రక్తం పడుతుందని అంటుంటారు. నిజమే. హెమోగ్లోబిన్ సరిపడగా వుంటేనే శరీరం ఎర్ర రక్తకణాలను సక్రమంగా వృద్ధి చేయగలుగుతుంది.
ఎర్రరక్తకణాలు సరిపడా వుంటేనే శరీరం ఆరోగ్యంగా వుంటుంది. ఎర్రరక్తకణాలు వుండాల్సిన సంఖ్యలో వుంటేనే శరీరానికి అలసట, నీరసం వుండదు. కాంతివంతంగా ఆరోగ్యంగా వుంటుంది.
అందుకే రక్త హీనత రాకుండా వుండాలంటే దానిమ్మ పండును రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ పండులోని ఫోలేట్, ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధిలో బాగా తోడ్పడుతాయ్.
అలాగే, ఈ పండులోని విటమిన్ ఎ,బి,సి,కె విటమిన్లు శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. సో, దానిమ్మ పండును వీలైతే రోజూ లేదంటే వారంలో రెండు మూడు సార్లయినా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఆకుకూరల్లో పాలకూరను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్త హీనత రాకుండా కాపాడుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com