సౌదీలో కుటుంబాన్ని రక్షించిన యువకుడు.. వీడియో వైరల్
- November 14, 2023
సౌదీ: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లోని నివాస భవనంలో మంటలు చెలరేగిన ఘటనలో ఓ సౌదీ యువకుడు ధైర్యం చేసి మొత్తం కుటుంబాన్ని రక్షించాడు. మంటల్లో చిక్కుకున్న ఓ మహిళను, ఆమె నలుగురు పిల్లలను రక్షించడంలో మోయెద్ ముహమ్మద్ అల్-యామీ అనే యువకుడు వీరోచిత పరాక్రమాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అల్-యామీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను తలుపులు పగలగొట్టి చిన్న పిల్లలను, వారి తల్లిని బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఊపిరాడక, కాలిన గాయాలకు గురైన యామిని ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా యామీ మాట్లాడుతూ.. తాను నివసిస్తున్న భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే భవనం వద్దకు చేరుకుని రెండవ అంతస్తు నుండి నివాసితులను ఖాళీ చేయించి, మూడవ అంతస్తులోకి ప్రవేశించాను. అక్కడ ఓ ప్లాట్ లో ఒక మహిళ, ఆమె నలుగురు పిల్లలు లోపల ఉన్నారని తెలుసుకున్న తర్వాత, సాహసం చేసి డోరును బద్దలుకొట్టి లోపలికి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల