విలేకరులను బయటకు పంపిన సైన్యం..
- May 25, 2016
విలేకరులను బయటకు పంపిన సైన్యం శ్రీనగర్: అసలే మిలిటరీ వాళ్లు నిర్వహించే కార్యక్రమం.. దేశం కోసం ప్రాణాలిచ్చే వారు జాతీయ గీతం పాడుతుంటే కనీసం లేచి నిలబడకపోతే వూరుకుంటారా? జాతీయగీతం పట్ల గౌరవం చూపని వారందరినీ ఉన్నపళంగా అక్కడి నుంచి పంపిచేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగింది. నగర శివారులో జమ్ముకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ వద్ద సైనికుల పాసింగ్ ఔట్ పరేడ్ జరుగుతోంది. ఇందులో భాగంగా జెండావందనం చేసి జాతీయ గీతం పాడారు ఆ సమయంలో ఈ కార్యక్రమం కవర్ చేయడానికి వచ్చిన స్థానిక కశ్మీర్ రీడర్, రైజింగ్ కశ్మీర్ పత్రికలకు చెందిన విలేకరులు లేచి నిలబడకుండా అలాగే కూర్చుని ఉన్నారు. దీంతో ఆగ్రహించిన ఆర్మీ అధికారులు వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే తమను కార్యక్రమం కవర్ చేయడానికి ఆహ్వానించారు కానీ అందులో పాల్గొనడానికి కాదు కదా అని ఓ విలేకరి ఎదురు ప్రశ్నించారు. ఆ సమయంలో తాను స్టోరీ కోసం నోట్స్ రాసుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత విలేకరులను బయటకు పంపిన ఆర్మీ అధికారి కూడా తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పారు. విలేకరులు కూడా జాతీయ గీతం, జాతీయ జెండా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







