దుబాయ్-షార్జా ట్రాఫిక్ అలెర్ట్: ఆ మార్గంలో వేగ పరిమితి తగ్గింపు
- November 15, 2023
యూఏఈ: దుబాయ్‌లోని అల్ ఇత్తిహాద్ రోడ్‌లోని కీలకమైన స్ట్రెచ్ వేగ పరిమితిని అధికారులు తగ్గించారు. నవంబర్ 20 నుండి షార్జా మరియు అల్ గర్హౌద్ బ్రిడ్జ్ మధ్య ఉన్న వేగ పరిమితిని 100kmph నుండి 80kmphకు అధికారులు తగ్గించనున్నారు. కొత్త వేగ పరిమితి అల్ ఇత్తిహాద్ రోడ్‌లోని షార్జా-దుబాయ్ సరిహద్దు నుండి అల్ గర్హౌద్ వంతెన వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. కొత్త వేగ పరిమితికి అనుగుణంగా రోడ్డుపై రాడార్లను సర్దుబాటు చేయనున్నారు. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు దుబాయ్ నుంచి షార్జాకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. దుబాయ్ ప్రధాన రహదారులపై వేగ పరిమితులను సమీక్షించడానికి RTA స్పీడ్ మేనేజ్మెంట్ మాన్యువల్‌ని ఉపయోగిస్తుంది. గైడ్ వేగ పరిమితులు, ట్రాఫిక్ ప్రవాహాన్ని అంచనా వేయడం ద్వారా పరిమితులను సెట్ చేయడంలో అధికారులకు ఇది సహాయపడుతుంది.
తాజా వార్తలు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!







