జెడ్డా, మక్కాలోని మరో 5 గవర్నరేట్లకు రెడ్ అలర్ట్ జారీ
- November 15, 2023
జెడ్డా: జాతీయ వాతావరణ కేంద్రం (NCM) మక్కా నగరం, జెద్దా మరియు మక్కా ప్రాంతంలోని మరో ఐదు గవర్నరేట్లలో(రాబిగ్, ఖులైస్, అల్-కమిల్, అల్-జమూమ్ మరియు బహ్రా) ఈ రోజు రాత్రి 12:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రెడ్ అలర్ట్‌కు వాతావరణ హెచ్చరిక స్థాయిని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. NCM సూచన ప్రకారం.. భారీ వర్షాలు, అధిక వేగంతో కూడిన గాలులు, సమాంతర దృశ్యమానత లేకపోవడం, వడగళ్ళు, కుండపోత ప్రవాహాలు మరియు ఉరుములు, ఈ గవర్నరేట్లను తాకే అవకాశం ఉంది. మక్కా ప్రాంతంలోని జెడ్డా, బహ్రా, రబీగ్, ఖులైస్, అలైత్ మరియు కున్ఫుదాలో మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇదిలా ఉండగా.. పౌర రక్షణ జనరల్ డైరెక్టరేట్ ప్రజలను అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోయల నుండి దూరంగా ఉండాలని, కుంటలు, వరదల్లో ఈత కొట్టడానికి సాహసించవద్దని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు







