వేసవి తాపం: స్కూల్ పనివేళల కుదింపు
- May 25, 2016
ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో పలు ప్రైవేటు స్కూళ్ళు తమ పని వేళల్ని తగ్గించుకోగా, మిగతా స్కూళ్ళు కూడా అదే దారిలో పయనించనున్నాయి. జులై నుంచి సుదీర్ఘమైన వేసవి సెలవులకు స్కూల్స్ సన్నద్ధమవుతున్నాయి. జులై నుంచి సెప్టెంబర్ వరకు ఈ సెలవులు ఉంటాయి. ఈసారి సమ్మర్ హాలీడేస్‌లో ఈద్ హాలీడేస్ కూడా కలుస్తున్నాయి. ఇప్పటిదాకా పని వేళల్ని కుదించని స్కూళ్ళు రంజాన్ ప్రారంభం నుంచి పనివేళల్ని తగ్గించాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మే 15 నుంచి చాలా వరకు ఇండిపెండెంట్ స్కూల్స్ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో పనివేళల్ని కుదించేశాయి. పనివేళల్ని 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు స్కూళ్ళు తగ్గించాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ సంవత్సరం గతంలో కన్నా ఎక్కువ ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పుడే 40 డిగ్రీలకు పైన దోహా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







