సౌదీ అరేబియాతో రైలు కనెక్టివిటి పై కువైట్ అధ్యయనం
- November 18, 2023
కువైట్: కువైట్-సౌదీ అరేబియాను కలిపే రైల్వే ప్రాజెక్ట్ కోసం ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని నిర్వహించడానికి కువైట్ పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. సమగ్ర అధ్యయనం చేసేందుకు SYSRTA కూటమితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకార ప్రయత్నం రెండు దేశాల మధ్య సురక్షితమైన రవాణా కోసం కనెక్టివిటీని మెరుగుపరచడం, స్థిరమైన, సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, మహ్మద్ బిన్ సల్మాన్ ల భాగస్వామ్య దృష్టిని ప్రతిబింబిస్తుందని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఈద్ అల్-రషీది వెల్లడించారు. కువైట్ - రియాద్ మధ్య 650 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైను రానుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే కనెక్టివిటీ ద్వారా ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకు తగ్గుతుంది. అధ్యయనం ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







