ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు!

- November 18, 2023 , by Maagulf
ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు!

మస్కట్: మస్కట్, సౌత్ అల్ బతినా మరియు అల్ దఖిలియా గవర్నరేట్‌లలో భారీ వర్షాలు కురిసాయి. ఈ మేరకు ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న గంటల్లో అల్ వుస్తా మరియు ధోఫర్ గవర్నరేట్‌లలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వీటితోపాటు ఉత్తర గవర్నరేట్‌లలో వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసింది.  ముసందమ్, అల్ బురైమి, నార్త్ అల్ బటినా, సౌత్ అల్ బతినా, అల్ దఖిలియా, అల్ హజర్ పర్వతాలు మరియు మస్కట్ గవర్నరేట్‌ల గవర్నరేట్‌లలో శుక్రవారం భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసాయి. వర్షం కురిసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వాడీలను (ఫ్లాష్ ఫ్లడ్) దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com