పారాసెట్మాల్ ని విరివిగా వాడేస్తే అంతే సంగతి.!
- November 18, 2023
ఏ చిన్న నొప్పి వచ్చినా.. లేదంటే కొద్దిగా శరీరం వేడెక్కినా (టెంపరేచర్) ఓ పారాసెటమాల్ టాబ్లెబ్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. దీని కోసం డాక్టర్ ప్రిస్కిప్షన్‌తో పని కూడా వుండదు.
కానీ, పారాసెటమాల్‌ని ఎక్కువగా వాడితే చాలా రకాల దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్‌ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల వృద్ధి తగ్గిపోయి, రక్త హీనత ఏర్పడుతుంది.
తద్వారా వీపరీతమైన నీరసం, అలసట వస్తాయ్. అలాగే అలర్జీ వున్నవారు పారాసెటమాల్‌ని వైద్యుని సలహా లేకుండా తీసుకుంటే, ఆ సమస్య మరింత తీవ్రతరమై ప్రాణాపాయం కూడా సంభవించొచ్చట.
నెలసరి సమయంలో కొంతమందిలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి పారాసెటమాల్ వాడుతుంటారు. కానీ ఆ టైమ్‌లో అస్సలు పారాసెటమాల్ తీసుకోరాదని చెబుతున్నారు.
అధిక రక్తప్రావం, కళ్లు తిరిగి పడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయట. అలాగే గర్భిణీ స్ర్తీలు, పాలిచ్చే తల్లలు కూడా పారాసెటమాల్‌ని విరివిగా వాడరాదని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం