తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల
- November 18, 2023
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో 10 రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. ఈ సందర్భంగా తెలంగాణను ప్రగతిపథంలో నడిపేందుకు 10 అంశాల కార్యాచరణను బీజేపీ నేతలు ప్రకటించారు. ధరణి స్థానంలో మీ భూమి యాప్ అందుబాటులోకి తెస్తామని.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
- ధరణి స్థానంలో మీ భూమి యాప్
- గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు
- ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు
- బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ
- 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల రద్దు
- ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాకు కమిటీ
- ఎస్సీల వర్గీకరణకు సహకారం
- అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
- అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు
- ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రూ.2,500 సాయం
- వరికి రూ.3,100 మద్దతు ధర
- ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీయ ఆవుల పంపిణీ
- నిజామాబాద్‌లో టర్మరిక్ సిటీ అభివృద్ధి
- డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు
- నవజాత బాలికలకు ఫిక్స్డ్ డిపాజిట్
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు 4 ఉచిత గ్యాస్ సిలిండర్లు
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







