భారతీయులకు గుడ్ న్యూస్..
- November 18, 2023
చాలా మంది కుటుంబంతోపాటు సరదాగా గడపాలని ఏ ప్రాంతానికి వెళ్లాలా..? కాస్త సంపన్నులైతే ఏ దేశానికి వెళ్లాలా? అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
అలా అంతర్జాతీయ పర్యటనలు చేయాలని ఆశపడే భారతీయులకు వీసా అవసరం లేని కొన్ని అందమైన దేశాలు స్వాగతం పలుకుతున్నాయి.
1. మారిషస్
భారతీయులకు అత్యంత స్నేహపూర్వక దేశాల్లో మారిషస్ ముందు వరుసలో ఉంటుంది. అందమైన బీచ్‌ల నుండి ఉష్ణమండల అడవుల వరకు, మీరు ఇక్కడ ప్రకృతి ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చు. వీసా లేకుండా భారతీయులు గరిష్టంగా 90 రోజులు మారిషస్‌లో ఉండగలరు.
2. ఫిజీ
అందమైన దృశ్యాలు, పగడాలు, దివులకు ఫిజీ దేశం పెట్టింది పేరు. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఫిజీలో భారతీయులు వీసా లేకుండా 120 రోజులు అంటే దాదాపు నాలుగు నెలలు హాయిగా గడపవచ్చు.
3.బార్బడోస్
కరేబియన్ దేశాలలో అందమైన దీవి బార్బడోస్. ఉష్ణమండల దీవులను ఇష్టపడేవారికి ఈ దేశం మంచి హాలిడే డెస్టినేషన్. ఇక్కడి హోటళ్లు విలాసవంతంగా ఉంటాయి. బార్బడోస్ భారతీయులకు వీసా రహిత దేశం. వీసా లేకుండా వరుసగా 90 రోజులు ఇక్కడ ఉండేందుకు అక్కడి ప్రభుత్వం భారతీయులకు అనుమతిస్తోంది.
4. ట్రినిడాడ్
బార్బడోస్ లాగే ట్రినిడాడ్, టొబాగో కూడా ఒక ద్వీప దేశం. ప్రకృతి, వన్యప్రాణుల ప్రేమికులకు ఇది అనువైన ప్రదేశం. ట్రినిడాడ్ దేశంలో భారతీయులు వీసా లేకుండా 90 రోజుల పాటు ప్రయాణించవచ్చు.
5.జమైకా
జమైకా కూడా ఒక కరేబియన్ ద్వీప దేశం. భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు వీసా లేకుండా 30 రోజులు తమ దేశంలో సరదాగా గడిపేందుకు ఇక్కడి ప్రభుత్వం అనుమతిస్తోంది. పర్వతాలు, వర్షారణ్యాలు, ద్వీపాలు, మరిన్నింటిని ఆస్వాదించాలనే వారికి జమైకా అనువైన దేశం.
6.సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్
సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ ఈ పేరు వినగానే ఏదో యూరోప్ దేశమని కొంత మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ ఈ దేశం కూడా ఒక కరేబియన్ దీవి. బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించాలనే వారికి ఈ దీవి చక్కటి లొకేషన్. భారతీయులు వీసా లేకుండా ఈ అందమైన ద్వీపంలో 30 రోజుల వరకు ఉండగలరు. అంతేకాదు సెయింట్ విన్సెంట్ వెళ్లిన వారు అక్కడ చుట్టు పక్కల ఉండే సమూహ ద్వీపాలను చుట్టి రావచ్చు.
7. కజకిస్తాన్
కజకిస్తాన్ తూర్పు యూరోప్, మధ్య ఆసియా దేశాలలో ఒకటి. దీనికి ఉత్తరాన రష్యా, తూర్పున చైనా, దక్షిణాన కిర్గిజిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశానికి నైరుతి సరిహద్దుల్లో కాస్పియన్ సముద్రం ఉంది. కజకిస్తాన్లో పీఠభూములు, గడ్డి మైదానాలు (స్టెప్పీలు), తైగ, రాక్ కేనియన్, కొండలు, నదీముఖద్వారాలు, మంచు శిఖరాలతో కూడిన పర్వతాలు, ఎడారి ప్రాంతాలూ ఉన్నాయి. భారతీయులు కజకిస్తాన్‌లో గరిష్టంగా 14 రోజుల పాటు వీసా లేకుండా పర్యటించవచ్చు.
8. భూటాన్
భారత దేశానికి సరిహద్దు దేశాలలో ఒకటైన భూటన్ కూడా ఒక చక్కటి హాలిడే డెస్టినేషన్. వీసా లేకుండా భారతీయులు భూటాన్ దేశంలో 14 రోజుల పాటు ఉండవచ్చు. స్వల్ప కాలం హాలిడే ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికి భూటాన్ చక్కటి డెస్టినేషన్. ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో భూటన్ ఒకటి. ఇక్కడి అందాలు ప్రకృతి ప్రేమికులకు బాగా ఆకట్టుకుంటాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం