వార్నింగ్ సైరన్‌లను పరీక్షించనున్న కువైట్

- November 20, 2023 , by Maagulf
వార్నింగ్ సైరన్‌లను పరీక్షించనున్న కువైట్

కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క సాధారణ పౌర రక్షణ విభాగం నవంబర్ 21వ తేదీన (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు సైరన్‌ల టోన్‌ల గురించి పౌరులు,  నివాసితులకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక(వార్నింగ్) సైరన్‌లను పరీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సైరన్‌ల వివిధ టోన్‌లు, సూచనల గురించి అవగాహన కల్పించడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రిత్వ శాఖ ఆపరేషన్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్-జనరల్ జమాల్ అల్-సాయెగ్ తెలిపారు. సైరన్ టోన్ లేదా సంబంధిత వాయిస్ మెసేజ్ వినబడకపోతే పౌర రక్షణ కార్యకలాపాలకు నంబర్ 25379278కు ఫోన్ చేయాలని ప్రకటన పౌరులను కోరింది. పౌరులు, నివాసితులకు అత్యవసర లేదా ప్రమాదం సంభవించినప్పుడు తప్పనిసరిగా తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలను గుర్తు చేయడానికి ఇటువంటి పరీక్షలను నిర్వహిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com