బిస్కెట్లతో హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి..
- May 25, 2016
మ నదేశంలో ఎంతో మంది పసిపిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. ఇవేమి పైపైన చెబుతున్న మాటలు కావు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంస్థ ఇచ్చిన నివేదికల ప్రకారం.. పోషకాహారలేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న తొలి 20 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ర్యాపిడ్ సర్వే ఆన్ చిల్ట్రన్ నివేదికలు కూడా ఇదే వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. సరే.. సమస్య ఉందని మనకు తెలుసు. కానీ పరిష్కారం ఏంటి.. అని ఆలోచించిన అలహాబాద్ హోంసైన్స్ కాలేజీ విద్యార్థిని అమ్మాతుల్ ఫాతిమా ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. సూపర్‌ఫుడ్‌గా పేర్కొనే స్పైరులినా అనే స్థానిక రకం నాచుతో బిస్కెట్లను తయారు చేసింది. చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసే ఈ బిస్కెట్లని నెలరోజుల పాటూ పిల్లలకు పోషకాహారంగా ఇవ్వడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి ఏడు నుంచి తొమ్మిదికి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించింది. త్వరలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ బిస్కెట్లని మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయనుండటం విశేషం
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







