ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక పై వేధింపులు..అండగా నిలిచిన హక్కుల కమిషన్

- November 21, 2023 , by Maagulf
ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక పై వేధింపులు..అండగా నిలిచిన హక్కుల కమిషన్

అనంతరపురం: ఇంట్లో పనిచేసే మైనర్ బాలికపై ఇంటి యజమానులు వేధింపులకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న IHRPC (అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్) రాష్ట్ర అధ్యక్షుడు వర ప్రసాద్, అనంతపురం జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు శ్రీదేవీలు బాధితురాలిని పరామర్శించి అండగా నిలిచారు. వివరాళ్లోకి వెళితే.. నవంబర్ 18న A.P.P వసంత లక్ష్మి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మైనర్ బాలికను ఇంటి యజమానులు వేధించడంతోపాటు తీవ్రంగా గాయపరిచారు.  గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం IHRPC కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో IHRPC రాష్ట్ర అధ్యక్షుడు వర ప్రసాద్, అనంతపురం జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు శ్రీదేవిలు, మీడియా సెల్ ఇంఛార్జ్ నబీ రసూల్, ఇతర అధికారులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. బాధితురాలిని పరామర్శించారు. అనంతరం వారి తల్లిదండ్రుల నుండి కేసు వివరాలను సేకరించారు. బాధితులికి న్యాయం జరిగే వరకు తాము అండగా నిలుస్తామని వెల్లడించారు. సకాలంలో స్పందించి బాధితురాలికి అండగా నిలిచిన వరప్రసాద, శ్రీదేవీలను IHRPC నేషనల్ ప్రెసిడెంట్ Dr.ముజాహిద్ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com