ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!

- December 09, 2025 , by Maagulf
ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!

మస్కట్: ఒమన్ లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాల ఆవిష్కరణకు 100 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన మరియు ఖనిజ మంత్రిత్వ శాఖ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించింది. ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ ఆధ్వర్యంలో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్‌లో వేడుకలు జరిగాయి.

1925లో మొదటిసారి ఒమన్ లో ఆయన్ నిక్షేపాలను గుర్తించారు.  ఇంధన రంగంలో చోటుచేసుకున్న చారిత్రక మైలురాళ్లను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి దోహదపడిన ప్రధాన పరివర్తనలను ఈ సందర్భంగా వివరించారు. ఇదే సమయంలో పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్‌లో ఒమన్ భవిష్యత్తు వ్యూహాత్మక ప్రణాళికలపై సమీక్షించారు.

చమురు అన్వేషణలో మొదటి అడుగు వేసి శతాబ్దం పూర్తి కావడం ఒక చారిత్రక మైలురాయి అని ఇంధన మరియు ఖనిజ శాఖ మంత్రి సలీం నాసర్ అల్ అవుఫీ అన్నారు.  1925 మే 18న డి'ఆర్సీ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీతో మొదటి ఒప్పందంపై సంతకం చేయడంతో ప్రయాణం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. దీని తర్వాత 1955లో "డౌకా-1" బావిని తవ్వడం ద్వారా పునాది దశ ప్రారంభమైందని, ఆ తర్వాత 1967లో ఒమాన్ ముడి చమురు మొదటి రవాణాను మినా అల్ ఫాల్ ఓడరేవు నుండి ఎగుమతి జరిగిందని వివరించారు. 

నాడు సగటున రోజుకు 5,000 బ్యారెళ్ల (bpd) ఉత్పత్తి జరుగగా.. నేడు అది ఒక మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుందని తెలిపారు.  ఈ వేడుకలో ఒమన్ చమురు మరియు గ్యాస్ ప్రయాణ 100వ వార్షికోత్సవానికి గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు.         

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com