గల్ఫ్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!

- December 09, 2025 , by Maagulf
గల్ఫ్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ లో గల్ఫ్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీనిని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో “గల్ఫ్ అవేర్ లీడర్స్ - వెల్‌బీయింగ్ అండ్ లీడర్‌షిప్” పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పరిధిలో 18–30 సంవత్సరాల వయస్సు గల వారిలో నాయకత్వ నైపుణ్యాలు, మానసిక అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నారు.

GCC సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరియు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ కార్యక్రమం తనదైన ముద్రను వేస్తుందని యువజన వ్యవహారాల మంత్రి రావన్ బింట్ నజీబ్ తౌఫికి తెలిపారు. వర్క్‌షాప్‌లు మరియు సెషన్‌ల వారిగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధిని పెంచే ఇంటరాక్టివ్ వాతావరణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com