దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!

- December 09, 2025 , by Maagulf
దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!

దోహా: ఖతార్, సౌదీ అరేబియా మధ్య హై-స్పీడ్ ఎలక్ట్రిక్ రైలు ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే, దోహా-రియాద్ మధ్య ప్రయాణ సమయం రెండు గంటలు తగ్గనుంది. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ (MoT) తెలిపింది. ఈ హై-స్పీడ్ రైలు 785 కిలోమీటర్ల పరిధిలో అల్-హోఫుఫ్, దమ్మామ్ వంటి అనేక ప్రాంతాల మీదుగా  హమద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానిస్తుందని తెలిపింది. గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని, దీంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 2 గంటల వరకు తగ్గుతుందని వెల్లడించింది.

 ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మెగా రైల్వే ప్రాజెక్ట్ ద్వారా 30వేల కంటే ఎక్కువ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను అందిస్తుందని భావిస్తున్నారు. 

అలాగే,  రెండు దేశాల GDPకి దాదాపు 115 బిలియన్ రియాల్స్ ఆదాయాన్ని అందిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించారు. ఈఆధునిక రైల్వే నెట్‌వర్క్ ద్వారా GCC దేశాల మధ్య ప్రాంతీయ అభివృద్ధికి మద్దతు ఇస్తుందని, అత్యంత వ్యూహాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటిగా మారుతుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com