భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?

- December 09, 2025 , by Maagulf
భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?

యూఏఈ: వ్యక్తిగత ఆభరణాలతో భారత్ కు ప్రయాణించే యూఏఈ నివాసితులకు త్వరలోనే కొత్త కస్టమ్ నిబంధనలు వచ్చే అవకాశం ఉంది. కస్టమ్స్ నిబంధనల్లో త్వరలోనే మార్పులు చేయనున్నట్లు భారత ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించడం ఈ వాదనకు బలం చేకూర్చుతుంది. కస్టమ్ లో త్వరలోనే సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

ముఖ్యంగా యూఏఈలో ఉన్న ఎన్ఆర్ఐలు, బంగారు ఆభరణాల పరిమితులను అప్డేట్ చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.  భారతదేశంలో బంగారం ధరలు గ్రాముకు రూ.13వేలకు చేరుకున్నాయి.  దుబాయ్‌లో గ్రాముకు  508 దిర్హామ్‌ల దగ్గర ఉంది. అయితే, ప్రస్తుత కస్టమ్ నిబంధనలు మాత్రం 10 ఏళ్ల కింద బంగారం ధరలకు తగ్గట్టుగా ఉన్నాయని ప్రవాసులు చెబుతున్నారు. ఇవి పర్యాటకం మరియు డెస్టినేషన్ మ్యారేజెస్ ను పెంచాలనే భారత లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని ఎత్తిచూపుతున్నారు.  

ప్రస్తుతం మేల్స్ రూ.50వేల విలువైన 20 గ్రాముల ఆభరణాలను మరియు మహిళలు రూ.1 లక్ష విలువైన 40 గ్రాముల ఆభరణాలను మాత్రమే కలిగి ఉండవచ్చు.  ప్రస్తుత ధరల్లో చిన్నస్థాయి వ్యక్తిగత ఆభరణాలను కూడా క్యారీ చేయలేని పరిస్థితి ఉందన్న వాదనలు ఉన్నాయి. బంగారం ధరలు పెరిగినందున ఎయిర్ పోర్టుల్లో పర్సనల్ ఆభరణాలను తీసుకెళ్లడం కష్టంగా మారిందని, తరచూ కస్టమ్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ప్రవాసులు వాపోతున్నారు. కస్టమ్ సంస్కరణలను వెంటనే ప్రకటించాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com