ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి..బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- November 21, 2023
బహ్రెయిన్: ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని హమాస్‌కు బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సూచించారు. అక్టోబరు 7 నాటి హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ముట్టడించింది. దీంతో పరిస్థితులు దారుణంగా మారాయి. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లో ఉన్న ఖైదీలకు బదులుగా హమాస్ చేతిలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని ప్రిన్స్ సల్మాన్ అన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్‌తో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన బహ్రెయిన్.. "దీనిని పరిష్కరించడానికి మేము మా శక్తి మేరకు ప్రతిదీ చేయాలి" అని చెప్పింది. వార్షిక మనామా డైలాగ్ సెక్యూరిటీ సమ్మిట్‌కు ముందు ఆయన మాట్లాడారు. మరోవైపు గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ఇప్పటివరకు 11,500 మంది పౌరులు మరణించారు.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







