2024లో 4 లాంగ్ వీకెండ్ లు

- November 22, 2023 , by Maagulf
2024లో 4 లాంగ్ వీకెండ్ లు

యూఏఈ: యూఏఈ క్యాబినెట్ ప్రకటించిన జాబితా ప్రకారం.. 2024లో యూఏఈ నివాసితులు కనీసం 13 ప్రభుత్వ సెలవులను ఆనందిస్తారు. ఈ సెలవులు ఉద్యోగులు ఏడాదిలో తీసుకునే 30 వార్షిక సెలవులకు అదనం. యూఏఈలోని మెజారిటీ ప్రవాసులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు వార్షిక సెలవులను బట్టి ప్లాన్ చేసుకుంటారు.  మంగళవారం ప్రకటించిన చాలా తేదీలు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఉన్నాయి. 2024ని మరింత మెరుగ్గా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడటానికి, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం తేదీలను ట్రావెల్ ఏజెన్సీలు ప్రకటించాయి. 

నూతన సంవత్సర వేడుకలు: 3-రోజుల వారాంతం
యూఏఈ నివాసితులు 2024ని సుదీర్ఘ వారాంతంతో ప్రారంభిస్తారు. కొత్త సంవత్సరం మొదటి అధికారిక సెలవుదినం జనవరి 1( సోమవారం). ఇది మూడు రోజుల వారాంతంగా రానుంది.  

ఈద్ అల్ ఫితర్: 6 రోజులపాటు సెలవులు
ఈ ఇస్లామిక్ పండుగ ఉపవాస నెల అయిన రంజాన్ ముగింపును సూచిస్తుంది. రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ప్రభుత్వ సెలవుదినంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల వరుసగా 29 లేదా 30 రోజులు ఉంటుందా అనేదానిపై ఆధారపడి ఇది దాదాపు నాలుగు లేదా ఐదు రోజులు సెలవు ఉంటుంది. IACAD వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన హిజ్రీ క్యాలెండర్ ప్రకారం, రంజాన్ 29 రోజులు ఉంటుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలు: ఏప్రిల్ 9(మంగళవారం),  ఏప్రిల్ 12(శుక్రవారం) వరకు ఉంటుంది. ఇక శని-ఆదివారం సెలవులు కావడంతో వరుసగా ఆరు రోజులపాటు పండుగ సెలవులు వచ్చినట్టవుతాయి.

అరఫా డే, ఈద్ అల్ అదా: 5 రోజుల సెలవు
ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడే అరఫా దినోత్సవాన్ని ధుల్ హిజ్జా 9న జరుపుకుంటారు. ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అదా తర్వాత మూడు రోజుల పాటు జరుపుకుంటారు. సంబంధిత గ్రెగోరియన్ క్యాలెండర్ తేదీలు: జూన్ 16(ఆదివారం),  జూన్ 19(బుధవారం). వారాంతం (జూన్ 15(శనివారం))తో సహా, పండుగకు గుర్తుగా ఐదు రోజులు సెలవు ఉంటుంది.

ఇస్లామిక్ నూతన సంవత్సరం: 1-రోజు సెలవు
2024 రెండవ కొత్త సంవత్సరం జూలైలో ఎక్కడో వస్తుంది. హిజ్రీ సంవత్సరంలో మొదటి రోజు అయిన ముహర్రం 1, జూలై 7న(ఆదివారం) వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఆదివారం వారాంతం లేని వారికి ఇది ఒక రోజు సెలవు.

ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు
ఇది రబీ అల్ అవ్వల్ 12న అని నమ్ముతారు. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోని తేదీ స్పష్టత రావాల్సి ఉంది.

యూఏఈ జాతియ దినం
సంవత్సరం చివరి అధికారిక సెలవుదినం సుదీర్ఘమైనది. డిసెంబర్ 2(సోమవారం) మరియు 3 (మంగళవారం)వరుసగా వస్తాయి. శనివారం-ఆదివారం వారాంతంతో కలిపితే, అది నాలుగు రోజుల సెలవు అవుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com