వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు..షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సిఎం జగన్
- November 23, 2023
అమరావతి: సిఎం జగన్ వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు వైఎస్‌ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేశారు. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు “వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు”. “వైఎస్‌ఆర్ షాదీ తోఫా” క్రింద రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో సిఎం జగన్ జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు / వైఎస్‌ఆర్ షాదీ తోఫా… ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి, ఇప్పటి వరకు రూ.349 కోట్లను 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వయసు పరిమితి పెట్టడం వల్ల బాల్యవివాహాలు తగ్గుతాయని…పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపించాలనే మోటివేషన్ కల్పించడం మరో ఉద్దేశ్యం అన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







