ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం: 4 రోజుల్లో 50 మంది ఖైదీలు విడుదల
- November 23, 2023
యూఏఈ: ఇజ్రాయెల్‌లో ఖైదు చేయబడిన 150 మంది పాలస్తీనియన్లకు బదులుగా గాజాలో బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే గాజా ఎన్‌క్లేవ్‌లోకి మానవతా సహాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ నాలుగు రోజుల విరామానికి బుధవారం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ - హమాస్ అధికారులు ఒప్పందం కుదుర్చుకోవచ్చని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, యుఎస్ తెలిపాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. 200 మందికి పైగా హమాస్ చెరలో ఉన్నారు. 50 మంది మహిళలు, పిల్లలను నాలుగు రోజులలో విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలకు బదులుగా 50 మంది బందీలను విడుదల చేయనున్నట్లు హమాస్ తెలిపింది. యుద్ధ విరమణ ఒప్పందం వందలాది మానవతా, వైద్య మరియు ఇంధన సహాయంతో కూడిన ట్రక్కులను గాజాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది అని హమాస్ వెల్లడించింది. సంధి కాలంలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఎవరిపైనా దాడి చేయకూడదని లేదా అరెస్టు చేయకూడదని ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







