సౌదీలలో 23.7%కి చేరుకున్న ఊబకాయం
- November 23, 2023
జెడ్డా: 2023 సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం.. సౌదీలలో స్థూలకాయం 23.7 శాతానికి చేరుకుంది. సౌదీ పురుషులలో ఊబకాయం రేటు 23.9 శాతంగా ఉండగా, మహిళల్లో 23.5 శాతానికి చేరుకుంది. మొత్తం ఊబకాయం 23.7 శాతానికి చేరుకుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం.. 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో ఊబకాయం సుమారు 24 శాతానికి చేరుకుంది. 15 ఏళ్లలోపు పిల్లల విషయానికొస్తే, వారిలో ఊబకాయం 7.3 శాతం ఉండగా, సాధారణ బరువు తక్కువగా ఉన్నవారు 41 శాతం ఉన్నారు. రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు కూరగాయలు, పండ్లు తినే పెద్దల శాతం వరుసగా 37 శాతం మరియు 25 శాతంగా ఉంది. ఏదో రకమైన స్మోకింగ్ చేసే పెద్దల శాతం దాదాపు 18 శాతంగా ఎండగా.. టీనేజర్లలో ఇది 17.5 శాతంగా ఉంది. ఇక స్మోకింగ్ చేయని వారి శాతం 82.5 శాతంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







