కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించడం ఎలా.?
- November 23, 2023
కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. శరీరం పని తీరు సక్రమంగా వుండాలంటే, కిడ్నీలు ఆరోగ్యంగా వుండాల్సిందే. అయితే, కిడ్నీల ఆరోగ్యంగా వున్నాయో లేదో తెలుసుకోవడం ఎలా.?
కిడ్నీ సమస్యల్ని సైలెంట్ కిల్లర్స్‌గా అభివర్ణిస్తారు. అయితే, కొన్ని రకాల లక్షణాలతో కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించొచ్చు. తీవ్రమైన తలనొప్పి, మూత్రంలో మంట, రక్తం పడడం, అలసట, నీరసం, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం లేదా తగ్గిపోవడం, మడమల వాపు.. తదితర లక్షణాల ద్వారా కిడ్నీ సమస్యల్ని ముందుగానే గుర్తించొచ్చు.
ఈ సమస్యలున్నట్లయితే, ముందుగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించాల్సి వుంటుంది. వైద్యుని పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స చేయించుకోవాలి. ఆల్రెడీ డయాబెటిక్స్ అయితే, క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.
ఒక్కసారి మూత్ర పిండాల సమస్యలకు గురయితే, అది దీర్ఘకాలిక సమస్యగా పరిణమించొచ్చు. సో, కిడ్నీ వ్యాధులు చిన్న చిన్న సమస్యలే అయినప్పటికీ అశ్రద్ధ చేయరాదు. ఆ సమస్యలు ముదిరితే దీర్ఘకాలం బాధపడాల్సి వస్తుంది. ప్రాణాపాయ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'