వీసా కోసం ఎదురుచూస్తున్న వరుణ్
- May 26, 2016
ముకుంద, కంచె, లోఫర్ చిత్రాలతో ఆకట్టుకున్న వరుణ్‌తేజ్ హీరోగా 'మిస్టర్' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ స్పెయిన్‌లో 10 రోజులపాటు జరగనున్నట్లు కథ అందించిన గోపీమోహన్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపారు. శ్రీధర్ సిపాన 'మిస్టర్' సినిమా డైలాగ్స్‌ను పూర్తి చేశారని, శ్రీను వైట్ల, టీం షూటింగ్ కోసం అందమైన లొకేషన్స్‌ని వెతికారని పేర్కొన్నారు. వీసా కోసం ఎదురుచూస్తున్నట్లు పోస్ట్ చేశారు.శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. నల్ల మలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. నాజర్, రఘుబాబు, శ్రీనివాస్‌రెడ్డి, పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్పెయిన్ షూటింగ్ అనంతరం బ్రెజిల్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







